KDP: కొండాపురం అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం మదర్స్ డే వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మండల అభివృద్ధి అధికారి నాగ ప్రసాద్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేయవద్దని, బాలికలను చదివించాలని, వారికి మంచి ఆహారం ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.