GNTR: కొల్లిపర మండల పరిధిలోని కృష్ణా నది కరకట్టపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కూల్ డ్రింక్స్ బాటిల్స్ లోడ్‌తో వస్తున్న మినీ లారీ అన్నవరం గ్రామ సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఘటనలో లారీలోని కూల్ డ్రింక్స్ బాటిల్స్ రోడ్డుపై పడ్డాయి. అయితే లారీలో ఉన్న వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు.