GNTR: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో మంగళవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను తెలియచేస్తూ అర్జీలు సమర్పించారు. ఎంఎస్ఎంఈ కార్పోరేషన్ ఛైర్మన్ టి.శివశంకర్ అర్జీలు స్వీకరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, వీర మహిళ ప్రతినిధి సోమరౌతు అనురాధ, లీగల్ సెల్ ప్రతినిధి చేజర్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.