ATP: గుంతకల్లు మండలం పాతకొత్త చెరువు గ్రామంలో కాశిరెడ్డి నాయన నూతన గుడి నిర్మాణంతోపాటు బొడ్రాయి ప్రతిష్ఠ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం గ్రామస్థులు, కాశిరెడ్డి నాయన భక్తుల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించారు. సుమారు 20 జతల ఎద్దులు పాల్గొన్నారు. రాతిదూలం లాగుడు పోటీలు ఎంతో ఉత్సాహంగా, రసవత్తరంగా జరుగుతున్నాయి.