ప్రకాశం జిల్లా దోర్నాల అటవీశాఖ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి దాడి చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించిన ఆయన, తప్పు ఎవరిదైనా సరే కేసు నమోదు చేయాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసులు శ్రీశైలం ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.