SKLM: అంబేద్కర్ కూడలి పరిధిలో శుక్రవారం సాయంత్రం మద్యం తాగి ట్రాఫిక్ కానిస్టేబుల్ రవి పై దాడికి యత్నించిన ఓ వ్యక్తి కి రెండో తరగతి మెజిస్ట్రేట్ కె. శివకుమార్ 30 రోజుల పాటు జైలు శిక్ష విధించారు. మద్యం తాగి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పై దాడికి యత్నించడం తో పాటు విధులకు ఆటంకం కలిగించినందుకు అతనికి ఈ శిక్ష విధించి నట్టు సీఐ ఈశ్వరరావు ఇవాళ తెలిపారు.