KRNL: వెల్దుర్తి మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేస్తున్న గుడ్లు చిన్నగా ఉన్నాయని మహిళలు వాపోతున్నారు. ఈ విషయంపై సీడీపీవోను ప్రశ్నించగా, అంగన్వాడీ టీచర్లు కూడా గుడ్లు సన్నగా ఉన్నాయని తమకు తెలిపినట్లు చెప్పారు. సమస్యను పీడీ దృష్టికి తీసుకెళ్లినట్లు సీడీపీవో ఇవాళ తెలిపారు. గుడ్ల నాణ్యత సమస్యను త్వరలో పరిష్కరిస్తామని పీడీ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.