KRNL: వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో మంత్రాలయం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు. మంత్రాలయం మండలం చిలకలదోన గ్రామానికి చెందిన భీమేశ్‌పై అదే గ్రామానికి చెందిన దేవేంద్ర, శివకుమార్, వెంకటేశ్‌లు దాడి చేసి గాయపరిచారని భీమేశ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై అన్నారు.