VZM: విజయనగరం ఉత్సవాల ఏర్పాట్లపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతి రాజు శుక్రవారం కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డిని కలెక్టర్ ఛాంబర్లో కలిసి ఉత్సవాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత ఏడాది నిర్వహించిన అన్ని వేదికల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజా ప్రతినిధులంతా ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలన్నారు.