సత్యసాయి: కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నల్లచెరువు మండలం ఉబిచెర్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్దిదారుల ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. వారిని ఆప్యాయంగా పలకరించి ప్రతి నెలా పెన్షన్ సక్రమంగా అందుతోందా?అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.