W.G: ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని, పోరాట పటిమను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు జయంతిని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. ఆంధ్ర కేసరి టంగుటూరి దేశం కోసం, రాష్ట్రం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుడన్నారు.