BPT: చీరాలలో శనివారం నియోజకవర్గ అభివృద్ధిపై మున్సిపల్ కార్యాలయం నందు కలెక్టర్ వెంకట మురళి, జిల్లా అధికారులు, ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా సంఘాలకు 6 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కులను కలెక్టర్ వెంకట మురళి అందజేశారు. మొత్తం 30 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజ్ రుణాలు మంజూరైనట్లు కలెక్టర్ తెలిపారు.