ప్రకాశం: ఒంగోలులోని త్రోవగుంటలో గల పచ్చళ్ల ఫ్యాక్టరీలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో పోగలు రావడం గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.