నేడు నెల్లూరులో జరగాల్సిన జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ వర్షం కారణంగా వాయిదా వేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షం కారణంగా పాడైనా ట్రాక్ & ఫీల్డ్ ఈవెంట్స్ కోర్ట్లు తిరిగి సిద్ధం చేస్తున్నామన్నారు. శనివారం జరగవలసిన ఈవెంట్స్ ఆదివారానికి వాయిదా వేసినట్లు వారు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా పోలీస్ సిబ్బంది, మీడియా గమనించాలన్నారు.