SKLM: వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్య దర్శిగా నరసన్నపేట మండలం పోతయ్యవలసకు చెందిన కనపల అరవింద్ నాయుడును నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తనను నమ్మి ఈ బాధ్యత అప్పగించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్, నరసన్నపేట సమన్వయకర్త కృష్ణచైతన్యకు ధన్య వాదాలు తెలిపారు.