విశాఖ నగరంలో వర్షాలు, ఈదురు గాలుల కారణంగా 80 ప్రాంతాల్లో 150 చెట్లు, 2 విద్యుత్ స్తంభాలు నేల కూలాయని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైందన్నారు. ఇప్పటికే 62 ప్రాంతాల్లో చెట్ల తొలగింపు పనులు పూర్తి చేయబడ్డాయని, మిగతా ప్రాంతాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.