SKLM: రణస్థలం బావరాజుపాలెంలో డ్రైనేజీ పనులకు శనివారం స్థానిక సర్పంచ్, ఉమ్మడి జిల్లాల సర్పంచుల సంఘం అధ్యక్షుడు పిన్నింటి వెంకట భానోజీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ ప్రభుత్వం ప్రతి గ్రామాల్లో ప్రజల సౌకర్యానికి రోడ్లు, డ్రైనేజీ పనులకు పెద్దపీట వేస్తుంది అని అన్నారు.