NLG: ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను నిఘా నీడలో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రయోగశాలల్లో సీసీ కెమెరాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, దానికి కావాల్సిన ప్రతిపాదనలను వెంటనే బోర్డుకు పంపాలని ఈనెల 23న ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 290 ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కళాశాలలో ఫిబ్రవరి మొదటివారం ప్రారంభంకానున్నాయి.