ATP: ఈ నెల 12న పోలీసుల సమక్షంలో టీడీపీ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.