NDL: నంద్యాల పట్టణంలో శుక్రవారం వైసీపీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వైసీపీని బలోపేతం చేస్తామని కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.