TPT: తిరుపతి నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తను తరలించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య తనిఖీ చేసారు. నగరంలో ఇంటింటి నుండి సేకరించిన చెత్తను తరలించేందుకు న్యూ బాలాజి కాలని, వినాయక సాగర్ వద్ద చెత్త తరలింపు కేంద్రాలను (గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్) ఏర్పాటు చేశారు.