TPT: వెంకటగిరి శ్రీ పోలేరమ్మ తల్లికి జాతర సందర్భంగా పెట్టే నైవేద్యంలో అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వేపాకు అంటు వ్యాధులు ప్రబలకుండా వైరస్ను నివారిస్తుంది.అవే గాక సొంటి అన్నం వల్ల కడుపు శుద్ధి చేయడంతో పాటు శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుంది. కుడుములు వల్ల ఊపిరితిత్తులు, కండరాలకు శక్తి లభిస్తుంది. మునగాకు వల్ల జీర్ణశక్తి ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా నిరూపణ అయింది.