SKLM: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో మండల వ్యవసాయ శాఖాధికారి M.మోహన్ రావు రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో తెలిపారు. వాతవరణంలో మార్పుల కారణంగా రైతులు నూర్పులు వాయిదా వేసుకోవాలన్నారు. పొలాల్లో, కల్లాల్లో ఉన్న వరి చేలు, ధాన్యం బస్తాలకు రక్షణ కల్పించాలన్నారు.