PPM: సీతంపేట మండలం గోయిది పంచాయతీ జక్కరవలస గ్రామంలో బుధవారం ఉదయం 8 అడుగుల కొండచిలువ హల్చల్ చేసింది. దీంతో గ్రామస్థులు భయాందోళన చెందారు. స్థానికులు ధైర్యం చేసి దానిని చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం అడవిలో వదిలిపెట్టడంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొండ ప్రాంతంలో నుంచి పాములు గ్రామల్లోకి వస్తున్నాయని స్థానికులు తెలిపారు.