VSP: నాటకరంగంలో విశాఖకు చెందిన నాంచారయ్యకు కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారం గురువారం లభించింది. సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. నాటక రంగంలో ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందజేసినట్లు నాటక అకాడమీ ఛైర్మన్ హిమాన్షు శుక్లా తెలిపారు.