టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) అరెస్టుపై పార్లమెంట్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేపట్టారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) పార్లమెంట్ కు చేరుకుని ఎంపీలతో కలిసి ఈ ధర్నాలో పాల్గొన్నారు. ప్లకార్డులు చేతబట్టి, గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతూ.. ఆంధ్రప్రదేశ్ (AP) లో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయనపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పార్లమెంట్ (Parliament) మహాత్ముడి విగ్రహం ముందు పార్టీలకు అతీతంగా ధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఎలా అణచివేస్తున్నారో దేశం మొత్తానికీ తెలియజెప్పేందుకే ఈ ధర్నా చేపట్టామన్నారు.