ATP: గుంతకల్లు మున్సిపాలిటీ లోని వార్డులో గురువారం తెల్లవారుజామున చేస్తున్న శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. చెత్తను రోడ్లమీద వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చెత్తను చెత్త బండికి ఇవ్వాలని సూచించారు.