నెల్లూరు జిల్లాలో గల 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 2705 అంగన్వాడీ కేంద్రాలకు గత కొద్ది నెలలుగా మెడికల్ కిట్లు సరఫరా నిలిచిపోయింది. దీంతో కేంద్రాల్లో చిన్నారులకు చిన్నపాటి అనారోగ్యం వాటిల్లినా, చిన్నపాటి గాయమైనా ఫస్ట్ ఎయిడ్ చికిత్స కరువు అవుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కిట్లలో 10 రకాల మందులు ఇచ్చేవారు.