E.G: మాజీ ప్రధాన మంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల డాక్టర్ బి.అర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మండపేటలోని వైసీపీ కార్యలయం వద్ద శుక్రవారం సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ.. రాజనీతిజ్ఞుడైన మన్మోహన్ సింగ్ను మహోన్నత వ్యక్తిగా కొనియాడారు.