SKLM: పొందూరు మండలంలో గ్యాస్ సిలిండర్లు, సెల్ ఫోన్ల దొంగతనాల కేసును పోలీసులు చేధించారు. బుధవారం టెక్కలిలో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని 30 గ్యాస్ సిలిండర్లు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా సిలిండర్లు, సెల్ ఫోన్లు మాయమవుతుండటం పై స్థానికులు ఫిర్యాదులు చేశారు. దీని పై ఎస్సై వి.సత్యనారాయణ నేతృత్వంలోని పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.