GNTR: పౌరసరఫరాల శాఖపై కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం జరిగింది. గ్యాస్, రేషన్ డీలర్లతో జాయింట్ కలెక్టర్ అశితోష్ శ్రీవాత్సవ్ సమీక్ష జరిపారు. వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా సమర్ధవంతంగా పని చేయాలని చెప్పారు. అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పనితీరు సరిగ్గా లేని డీలర్లను తొలగిస్తామని స్పష్టం చేశారు.