సత్యసాయి: కదిరి లక్ష్మీనరసింహ స్వామికి నేడు జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఉదయం మూలవిరాట్టుకు అభిషేకం, భక్తులకు నిజరూప దర్శనం కల్పిస్తామని అర్చకులు తెలిపారు. రాత్రికి ఖాద్రీశుడు నృసింహావతారంలో దర్శనమిస్తారని పేర్కొన్నారు. అలాగే కుమ్మరవాండ్లపల్లిలో కాత్యాయినిదేవిగా మల్లాల మ్మదేవి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.