కృష్ణా: దార్శనికుడు మండలి వెంకట కృష్ణారావు అని టీడీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు దిరిశం వెంకట్రావ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. శనివారం అవనిగడ్డ వంతెన సెంటర్లోని కృష్ణారావు విగ్రహానికి ఘంటసాల మండలం చిట్టూర్పు టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ వరప్రసాద్, నాయకులు నివాళులు అర్పించారు.