కోనసీమ: ‘మొంథా’ తుఫాన్ రైతును నిండా ముంచింది. ప్రాణ, ఆస్తి నష్టం లేకపోయినా ఈ ప్రాంత రైతులు మాత్రం తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వర్షాలు, గాలులు ప్రభావంతో మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా వరి చేలు నీట మునిగాయి. చాలా చోట్ల వరి పంట పడిపోయింది. నీటిలో నానుతోంది. దీపాల అమావాస్య అనంతరం రైతులు కోతలకు సిద్ధపడ్డారు. కాగా అనుకోని విధంగా పకృతి కన్నెర్ర చేసింది.