NLR: నిత్యవసర సరుకులపై అధిక ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గించాలని మండల సీపీఎం పార్టీ కార్యదర్శి అన్వర్ భాష కోరారు. గురువారం అనంతసాగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద స్థానిక నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలాంటి చార్జీలు పెంచబోమని చంద్రబాబు నాయుడు చెప్పారు అని గుర్తుచేశారు.