SKLM: శ్రీకాకుళం స్థానిక రిమ్స్ హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న రాముని సన్యాసిరావు (60)కి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అయ్యింది, ఈ విషయం తెలుసుకున్న ఎస్టీ, ఎస్టీ జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు దండాసి రాంబాబు స్పందించి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈయన ఇప్పటివరకు 37 సార్లు రక్తదానం చేసినట్లు తెలియజేసారు.