VZM: వందేమాతరం గీతం రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం రాజాం అంబేడ్కర్ సెంటర్లో స్దానిక పోలీసులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, డ్రైవర్లచే గీతం ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా ఎస్సై రవికిరణ్ తెలిపారు. ఈ గీతం సామాన్యులనూ సమరయోధులుగా మార్చిందన్నారు.