అన్నమయ్య: రక్తదానం ప్రాణదానంతో సమానమని BJP జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సేవా పక్షోత్సవాలు పిలుపుమేరకు శనివారం పెనమలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో BJP కార్యకర్తలు రక్తానం చేశారు. రక్తదానం చేసేందుకు మండలంలో 33 మంది యువకులు ముందుకు రావడం ఆశించదగ్గ విషయమని సాయి లోకేష్ పేర్కొన్నారు. రక్తదానం చేసిన వారికి సేవా ప్రశంసా పత్రాలు అందజేశారు.