VZM: 2023-24 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన 16మంది హెూంగార్డ్స్ పిల్లలకు రూ.2000 చొప్పున మెరిట్ స్కాలర్షిప్లు SP దామోదర్ తన కార్యాలయంలో బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్యతోనే భవిష్యత్తు బలపడుతుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించాలని సూచించారు. అలాగే హెూంగార్డ్స్ సంక్షేమం కోసం ప్రోత్సాహకాలు కొనసాగుతాయన్నారు.