VZM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం లేఖ రాశారు. తెలుగు భాష అభివృద్ధి పరిరక్షణకు ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి రూ.10 కోట్లు కేటాయించారని, త్వరలో తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కూడా ఏపీ మాదిరిగానే తెలుగు భాష పరిరక్షణకు నిధులు కేటాయించాలని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు.