E.G: జనసేన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఈ నెల 30న విశాఖపట్నం మున్సిపల్ స్టేడియంలో సాయంత్రం 3 గంటలకు జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 15 వేల మందికి పైగా పార్టీ నాయకులు, క్రియాశీలక వాలంటీర్లు హాజరవుతారని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.12 కమిటీల ద్వారా ఏర్పాట్లను పటిష్టం చేసినట్లు ఆయన వెల్లడించారు.