AP: అనంతపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీసు ముట్టడికి యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ అభిమానులు యత్నించారు. అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో MLA క్యాంపు కార్యాలయం వద్ద ఫ్యాన్స్ బైఠాయించి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దగ్గుపాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు.