VZM: విజయనగరం స్థానిక టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో అమ్మ నాన్న స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణి చేశారు. ఈసందర్బంగా అధ్యక్షులు పారుపూడి మధుసూదనరావు మాట్లాడుతూ.. వినాయక చవితి రోజున ప్రజలంతా మట్టి విగ్రహాలను వాడాలని.. పర్యావరణం కలుషితం చేసే రంగు విగ్రహాలు వాడవద్దని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్యదర్శి తిరుపతిరావు పాల్గొన్నారు.