E.G: మెగా డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల చేయడంతో అభ్యర్థుల్లో సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 1,241 పోస్టులకు గానూ జడ్పీ, మండల పరిషత్‌లకు 1033 కేటాయించారు. మున్సిపల్ 72, కార్పొరేషన్ పాఠశాలలకు 136 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల ధ్రువపత్రాలను రేపు గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ్ ఇంజినీరింగ్ కళాశాలలో పరిశీలిస్తారు.