భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణానికి ఎంపికైన నలుగురు గగన్యాత్రిలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సత్కరించారు. గ్రూప్ కెప్టెన్లు శుభాన్షు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్‌లను ఆయన అభినందించారు. కాగా, ఈ నలుగురు వ్యోమగాములు గగన్‌యాన్ మిషన్ కోసం కఠినమైన శిక్షణ పొందుతున్నారు.