భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అధికారిక పర్యటన కోసం అల్జీరియాకు వెళ్లారు. ఈ పర్యటన భారత్, అల్జీరియా మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించిన తర్వాత ఇది ఆయన మొదటి విదేశీ పర్యటన కావడం విశేషం. ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడతాయని ADGPI పేర్కొంది.