BDK: భద్రాచలంలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదానానికి ఖమ్మం జిల్లాకు చెందిన భక్తుడు ఆదివారం లక్ష రూపాయలు విరాళంగా అందించాడు. ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రం బ్యాంక్ కాలనికి చెందిన పోట్ల వంశీకృష్ణ స్వామివారి అన్నదానం నిమిత్తం 100,116/- రూపాయలు విరాళంగా రామాలయం వద్ద అందించారు. ఈ విరాళం చెక్కును ఆలయ ఈవో రమాదేవికి అందించారు. అనంతరం రామయ్య దర్శనం చేసుకున్నారు.