టీమిండియా స్టార్ క్రికెట్ ఛతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ‘X’ వేదికగా పేర్కొన్నాడు. ‘భారత జెర్సీని ధరించడం, జాతీయగీతం పాడటం, గ్రౌండ్లో అడుగుపెట్టిన ప్రతిసారి నా శాయశక్తులా ఆడేందుకు ప్రయత్నించా. నాకు అవకాశం ఇచ్చిన BCCI, సౌరాష్ట్ర క్రికెట్, జట్లు, ప్రాంచైజీలకు కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చాడు.