VZM: యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయ ఆద్వర్యంలో బ్యాంకింగ్ సేవలు, సైబర్ మోసాలపై ద్వారపూడి గ్రామంలో గ్రామస్తులకు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివారం అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ సుబ్బయ్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న అనేక పథకాలను ప్రభుత్వరంగ బ్యాంకులను వినియోగించుకోవాలని సూచించారు.