NRML: భైంసా పట్టణంలోని రాజీవ్ నగర్లో ఆదివారం ఉదయం భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐ గోపీనాథ్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డెన్ సర్చ్‌లో సరైన పత్రాలు లేని 86 బైకులను సీజ్ చేశారు. ప్రతి ఒకరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రజల భద్రత కోసం నిరంతరం తనిఖీలు చేస్తున్నట్టు ఏఎస్పీ తెలిపారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు